చర్చ: భద్రాచలం: రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన దాతలకు కృతజ్ఞతలు
మెగా రక్తదాన శిబిరం విజయవంతం అవ్వడం పట్ల భద్రాచలం | పట్టణ సీఐ ఎం.నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.
.
రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన దాతలకు కృతజ్ఞతలు
భద్రాచలం సీఐ నాగరాజు
భద్రాచలం టౌన్, ప్రభాతవార్త:
పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అవ్వడం పట్ల భద్రాచలం | పట్టణ సీఐ ఎం.నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సామాజిక సేవాభావం కలిగిన యువకులు, స్వచ్ఛంద సేవా సంఘాలు, న్యాయవాదులు, ఆటో యూనియన్ కార్మికులు రక్తదానంలో పాలుపంచుకున్నారని, అదేవిధంగా చర్ల, దుమ్ముగూడెం నుంచి కూడా పలువురు ఈ రక్తదానంలో పాల్గొన్నారని, మొత్తం 102 మంది రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయడం ద్వారా రక్తదాతలు తమ సేవాభావాన్ని, సామాజిక | బాధ్యతను చాటారని, తమ విజ్ఞప్తికి స్పందించి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు