చర్చ బెల్లంపల్లి : బెల్లంపల్లి 29వ వార్డులో గడప గడపకు బిఆర్‌ఎస్ ప్రచారం

చర్చ బెల్లంపల్లి
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో బిఆర్‌ఎస్ అభ్యర్థి రాజులాల్ యాదవ్ గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఇప్పటికే మూడు సార్లు వార్డు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను, మరోసారి సేవ చేసే అవకాశం కల్పించాలని రాజులాల్ యాదవ్ అభ్యర్థించారు. గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, నాలుగోసారి కూడా కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.