చర్చ,పెద్దపల్లి: పత్తికి మద్దతు ధర కల్పించాలంటూ బిఆర్ఎస్ ఆందోళన
చర్చ,పెద్దపల్లి ప్రతినిధి: పత్తికి మద్దతు ధర కల్పించాలంటూ బిఆర్ఎస్ ఆందోళన

చర్చ,పెద్దపల్లి ప్రతినిధి:
పత్తికి మద్దతు ధర కల్పించాలంటూ బిఆర్ఎస్ ఆందోళన…
పత్తికి మద్దతు దర కల్పించాలంటూ భారత రాష్ట్ర సమితి పిలుపులో బాగంగా పెద్దపల్లి వ్యవసాయం మార్కెట్ వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి , పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో ధర్నా కు దిగారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లడుతూ
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో అధికార పార్టీ నాయకులు, ట్రేడర్లు, సీసీఐ అధికారులు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా షరతులు లేకుండా పత్తిని మద్ద ధర కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రాబోయే కాలంలో రాష్ట్రంలోని రైతులందరినీ ఏకం చేసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరిక…ఈ కార్యమంలో బిఆర్ఎస్ నేతలు రఘువీర్ సింగ్,గోపు.అయిలయ్య యాదవ్,ఉప్పు రాజ్ కుమార్,ఐరెడ్డి వెంకట్ రెడ్డి,స్టాలిన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.