చర్చ, జగిత్యాల : అది బస్టాప్ కాదు .. ఆటోస్టాండ్..!
అది బస్టాప్ కాదు .. ఆటోస్టాండ్..!
- ఆటోల అడ్డగా మారిన జగిత్యాల బస్టాప్
- ట్రాఫిక్ నిభందనలు గాలికి వొదిలి చోద్యం చూస్తున్న ట్రాఫిక్ యంత్రాంగం
చర్చ, జగిత్యాల : ప్రయానికులను సరైనా గమ్యస్థానాలకు చేర్చేందుకు బస్టాఫ్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అవికాస్తా ఆటోలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇదేకోవాలో జగిత్యాల పాత బస్టాండ్ లో ధర్మపురి రూట్లో వచ్చే బస్సుల కోసం ప్రయానికులను దీంచేందుకు ఏర్పాటు చేసిన బస్టాఫ్ గత కొన్నేళ్లుగా ఇలాగే ఆటోలకు అడ్డాగా మారిపోయింది. ఈ బస్టాఫ్ కు మొదట రెండు వైపులా ఆటోలతో నింపిన ఆటోవాలాలు ఇప్పుడు ఏకంగా బస్టాఫ్ లోనే ఆటోలను నిలుపుతూ ప్రయానికులను రోడ్లపాలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. అలాగే ఈ బస్టాఫ్ లో బస్సు ఆపేందుకు చోటు లేనిపరిస్థితుల్లోను ఆర్టిసి డ్రైవర్లు రోడ్డుమీద బస్సులను నిలుపుతున్నారని స్థానికులు అంటున్నారు. దీనికితోడు బస్సు నిలవగానే చుట్టూ చేరే ఆటోలతో రోడ్డుపై వెళ్లే వాహనదారులకు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్న చందంగా మారుతొందని వాహనదారులు అంటున్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే బస్టాఫ్ ను ఆటోవాలాలు ఆక్రమిస్తుండగా ఇదే ట్రాఫిక్ పోలీసుల విధినిర్వహణలోని చిత్త శుద్ధికి నిదర్శనంగా స్థానికులు అంటున్నారు. ఇదే రూట్లో నిత్యం తిరిగే మొబైల్ ట్రాఫిక్ పెట్రోలింగ్ పోలీసులకు ఈ దూరక్రమణ సంఘటన కనిపించకపోవడం వంటివి ట్రాఫిక్ నిబంధనలు గాలికి, ట్రాఫిక్ పోలీసుల నిర్లక్యానికి నిదర్శనమీ సంఘటనలుగా స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాదికారులు స్పందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.