చర్చ : కొత్తగూడెం మున్సిపాలిటీ , అభివృద్ధి హామీలతో విజయ ఢంకా మోగించనున్న గుగులోత్ విజయలక్ష్మి రమేష్ బాబు…
అభివృద్ధి హామీలతో విజయ ఢంకా మోగించనున్న గుగులోత్ విజయలక్ష్మి రమేష్ బాబు
– ఆర్థిక ఉపాధి కల్పనలు లక్ష్యమే ధ్యేయంగా కార్పొరేషన్ అభివృద్ధి ఉంటుంది
చర్చ, కొత్తగూడెం మున్సిపాలిటీ:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపద్యంలో 23 వ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిని గుగులోత్ విజయలక్ష్మీ రమేష్ బాబు అభివృద్ధి హామీలతో కార్పొరేటర్ గా విజయఢంకా మోగించనున్నారు. ప్రచారంలో భాగంగా విజయలక్ష్మి రమేష్ బాబు మాట్లాడుతూ, గడిచిన రెండు సంవత్సరాలలో కార్పొరేషన్ కు ఎన్నికలు జరగక కార్పొరేషన్ అభివృద్ధి నిలిచిపోయింది. కార్పొరేటర్ గా నన్ను గెలిపిస్తే ప్రజలకు అభివృద్ధి ఫలాలను, మౌలిక సదుపాయాలను అందించే దిశగా పని చేస్థాను. ప్రభుత్వాలు ఏవైనా అర్హులైన ప్రజలకు ఇండ్ల స్థలాలను, కాలనీ ఇండ్లు వంటి అభివృద్ధి ఫలాలను అందజేస్థాను. కార్పొరేషన్ లో ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ లను త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ లుగా మార్పు చేయడమే గాక, కొత్త సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచి నీటి కనెక్షన్ లు, విద్యుత్ స్థంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్థాను. కార్పొరేటర్ కార్యాలయం, కమిటీ హాల్, లైబ్రరీ వంటి మొదలగు అభివృద్ధి పనులకు శ్రీకారం చూడతాను. పేదవారికి మహిళలకు మెప్మా ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాను. జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి నంబర్ లు వంటివి మధ్యవర్తి లేకుండానే లంచాలు ఇవ్వకుండానే ప్రభుత్త్వంతో పని చేయించుకునే విధంగా కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తాను. ఏఎన్ఎం లతో ఇంటింటి సర్వే నిర్వహించి కార్పొరేషన్ ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాను. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మనిషిని నేను. మీ ఓటును ఉంగరం గుర్తుపై వేసి నన్ను కార్పొరేటర్ గా గెలిపించి కార్పొరేషన్ అభివృద్ధికి సంహరించగలరని ఓటర్లని కోరారు. ప్రచారం లో విజయలక్ష్మి రమేష్ బాబు లకు మద్దతుగా ఓటర్లు, గ్రామస్తులు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.