చర్చ, జగిత్యాల: అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పక పాటించాలి – జిల్లా ఎస్పి అశోక్ కుమార్
అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పక పాటించాలి
- నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – జిల్లా ఎస్పి అశోక్ కుమార్
చర్చ, జగిత్యాల: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి నామీ నేషన్ కేంద్రం వద్ద పతిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిదిలోని ఐలాపూర్, పైడిమడుగు గ్రామలో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియను డిఎస్పి తో కలిసి పరిశీలించారు
మొదటి విడతలో బాగంగా ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలు, వార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభ కావడం జరిగిందని, నామినేషన్ ప్రక్రియకు అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లును చేయడం జరిగిందని ఎస్పీ అన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిది నిబంధన, నామినేషన్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంలో అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేష్, ఎస్.ఐ లు చిరంజీవి, రామచంద్రం ఉన్నారు.