News & Views

చర్చ, హైదరాబాద్: రాష్ట్రంలోని నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మార్పు

తెలంగాణ రాష్ట్రంలోని నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మార్పు

ఈనెల 22 న నూతన సర్పంచుల పదవీ బాధ్యతలు చర్చ కమాన్ పూర్ : రాష్ట్రంలోని నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ (అపాయింటెడ్ డే) తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన డిసెంబర్ 20వ తేదీని డిసెంబర్ 22కు మారుస్తూ పంచాయతీరాజ్ శాఖ ప్ర‌క‌ట‌న‌
డిసెంబర్ 20న సరైన ముహూర్తాలు లేవని, తేదీని మార్చాలని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులందరూ డిసెంబర్ 22వ తేదీనే పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.