చర్చ, పాల్వంచ: తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి (డ్రగ్స్) రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్చ పాల్వంచ
పాల్వంచలో తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి (డ్రగ్స్) రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పాల్వంచ డిగ్రీ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపే ఉద్దేశంతో విద్యార్థులతో కలిసి ముందుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.అనంతరం విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు..
డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ…ముఖ్యంగా చాలా మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. అంతేకాక, సమాజంలో కూడా రకరకాల సమస్యలకు కారణం అవుతున్నారు.
డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, వాటికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంబర్స్, యువకులు, మహిళా నేతలు పాల్గొన్నారు.
ఈ అవగాహన ర్యాలీ మరియు సదస్సులో డీఎస్పీ సతీష్ కుమార్ తో పాటు సీఐ సతీష్, రూరల్ ఎస్సై సురేష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు