News & Views

చర్చ, సత్తుపల్లి , గంజాయి సరఫరా చేసి సేవించే ముగ్గురిని పట్టుకున్న సత్తుపల్లి పోలీసులు…

గంజాయి సరఫరా చేసి సేవించే ముగ్గురిని పట్టుకున్న సత్తుపల్లి పోలీసులు…

ముగ్గురిలో ఒకరు మైనర్ బాలుడు-:

సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన పెయింటర్ కువ్వారపు సతీష్ కుమార్ వయస్సు 20 సంవత్సరాలుతండ్రి వెంకటేశ్వరరావు, 17 సంవత్సరాలు వయస్సు గల మైనర్ బాలుడితో కలసి చెడు స్నేహాలకు అలవాటుపడి సుమారు నాలుగు (4) సంవత్సరాల నుండి మద్యం తాగుడుకు, గంజాయి పీల్చటానికి అలవాటుపడి గతములో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయిని చిన్న ప్యాకెట్లలో కొనుక్కొని గంజాయిని పీల్చుతూ వారి ద్వారా ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ లో గంజాయి అమ్ముతారన్న విషయం తెలుసుకొని 25.10.2025 తేదీన రాత్రి సత్తుపల్లి నుండి బయలుదేరి ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ లో ఉన్న ఆవులపాక గ్రామానికి వెళ్ళి అక్కడ గంజాయి అమ్మే భగవాన్ అనే వ్యక్తి వద్ద అరకిలో గంజాయిని కొనుక్కొని వచ్చి ఇద్దరూ తీసుకొని పీల్చుతూ, గురువారం రోజు కూడా మెట్ట ఆంజనేయ స్వామి గుడి సమీపంలో వున్న వైకుంఠ ధామం వద్దకు వెళ్ళి గంజాయిని పీల్చి, మరలా గంజాయి కొనుక్కొని రావడానికి డబ్బుల కొరకు మిగిలిన గంజాయి ఎవరికైనా అమ్ముదామని ఇద్దరూ కలిసి వారివద్ద మిగిలిన గంజాయిని తీసుకొని మోటార్ సైకిల్ ట్యాంక్ కవర్ లో పెట్టుకొని వెళుతుండగా సత్తుపల్లి పోలీసు వారు ఇక్కడ వాహానాలు తనిఖీ చేయుచుండగా వారిని చూసి పట్టుబడతామనే భయంతో పారిపోవడానికి ప్రయత్నిచగా నిందితులను పట్టుకొని వారి వద్ద వున్న 100 గ్రాముల గంజాయిని , ఒక మోటార్ సైకిల్ ను స్వాధీన పరచుకొన్నారు పోలీసులు.నిందితులపై ఎన్డీపిఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఇద్దరినీ సత్తుపల్లి కోర్టులో హాజరు పరిచారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంజాయి నిరోధక చట్టంలో భాగంగా ఎవరైనా వ్యక్తులు గంజాయి కొన్నా కానీ అమ్మినా కానీ గంజాయి పీల్చినా కానీ అటువంటి వారిపై పిడి కేసులను నమోదు చేయబడతాయి అని, ఇట్టి సమాచారమును పోలీసు వారికి అందజేస్తే తగిన రివార్డ్ ఇవ్వబడుతుంది అని వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయి అని సత్తుపల్లి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి.శ్రీహరి తెలిపారు.