చర్చ : జగిత్యాల జిల్లా, అర్బన్ హౌసింగ్ కాలనీలో అంగన్వాడి కేంద్రాలను ఆరంభించిన ఎమ్మెల్యే…

అర్బన్ హౌసింగ్ కాలనీలో అంగన్వాడి కేంద్రాలను ఆరంభించిన ఎమ్మెల్యే…
జగిత్యాల లోని నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మరో విద్యా కేంద్రాన్ని ప్రారంభించారు. శనివారం అర్బన్ హౌసింగ్ కాలనీ లోని చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రెండు అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి డా నరేష్ సీడీపీఓ మమత, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల లక్ష్మణ్, చెట్ పెల్లి సుధాకర్, దుమాల రాజ్ కుమార్, శ్రీనివాస్, క్యాదసు నవీన్, తొలిప్రేమ శ్రీనివాస్, పోతునుక మహేష్, ఆరుముల్ల పవన్,
రామగిరి రమేష్, స్వామి, ఖలీల్, రాజు, గంగాధర్, అధికారులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.