చర్చ : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల దేవుని తండాకు చెందిన అంగన్వాడి టీచర్ గొట్టె పరిమళ శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది…

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల దేవుని తండాకు చెందిన అంగన్వాడి టీచర్ గొట్టె పరిమళ శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గత 23 సంవత్సరాలుగా అంగన్వాడి టీచర్ విధులు నిర్వర్తిస్తున్న పరిమళ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు, గ్రామస్తుల చర్చించుకుంటున్నారు. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పరిమళకు భర్త నరేష్, కుమారులు శరత్ కుమార్, సుశాంత్ లు ఉన్నారు. పరిమళ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు చందుర్తి పోలీసులు..