News & Views

చర్చ : అశ్వారావుపేట ప్రజానికానికి ఎమ్మెల్యే సూచనలు. మొంథా తుఫాను నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు…

అశ్వారావుపేట ప్రజానికానికి ఎమ్మెల్యే సూచనలు.

మొంథా తుఫాను నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. నియోజకవర్గంలోని రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని సూచించారు. పంట నిల్వ కేంద్రాల వద్ద రక్షణ చర్యలను తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశించారు. అతి భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచించారు. వాగుల వద్ద తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ఎక్కడ కూడా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అదేశించారు.