చర్చ : జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ చే ఆటో స్టాండ్ అడ్డా ప్రారంభం…

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ చే ఆటో స్టాండ్ అడ్డా ప్రారంభం…
జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనిలో అక్కడి ప్రజలు జగిత్యాల పట్టణం తోపాటు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అనువుగా ఏర్పాటు చేసిన ఆటో స్టాండ్ అడ్డాను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు.
అర్బన్ హౌసింగ్ కాలని లో ఆటో స్టాండ్, బస్ స్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల లక్ష్మణ్, చెట్ పెల్లి సుధాకర్ తొలిప్రేమ శ్రీనివాస్ చింత సుధీర్, రామగిరి రమేష్, స్వామి, ఖలీల్, రాజు,
ఫజల్, అక్మల్, సలీం, సోహెల్, లతీఫ్, ఫజల్, ఇమ్రాన్, శ్రీనివాస్ ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.