News & Views

చర్చ : జూలూరుపాడు , అద్వానంగా ఉన్న రహదారులపై బీఆర్ఎస్ రాస్తారోకో , రోడ్ల మరమ్మతులు తక్షణం చేపట్టాలని డిమాండ్…

రోడ్ల మరమ్మతులు తక్షణం చేపట్టాలని డిమాండ్...

చర్చ : జూలూరుపాడు , అద్వానంగా ఉన్న రహదారులపై బీఆర్ఎస్ రాస్తారోకో , రోడ్ల మరమ్మతులు తక్షణం చేపట్టాలని డిమాండ్…

కొత్తగూడెం–ఖమ్మం రాష్ట్ర రహదారిని తక్షణం మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు జూలూరుపాడు వద్ద రాస్తారోకో నిర్వహించారు. పార్టీ జిల్లా నాయకుడు లకావత్ గిరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో కార్యకర్తలు నినాదాలతో రహదారిని ముట్టడించారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ప్రజల సౌకర్యాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలూరుపాడు నుంచి సుజాతనగర్ వరకు 10 కిలోమీటర్ల రోడ్డు గుంతలతో అద్వాన్నంగా మారిందని, దాని వల్ల ప్రమాదాలు చోటుచేసుకుని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఈ రహదారినే తరచుగా ఉపయోగిస్తున్నా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. “మంత్రులకు కమిషన్లు, కాంట్రాక్టులు పంచుకోవడమే శ్రద్ధ. ప్రజా సమస్యలపై కనీస స్పందన లేదు” అని గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి పనులు తక్షణమే ప్రారంభించకపోతే వేలాదిమందితో మహా ధర్నా చేపడతామని హెచ్చరించారు.