చర్చ :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట , షార్ట్ షర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు కార్ దగ్దం…

షార్ట్ షర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు కార్ దగ్దం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో కారు ( టిజి 28 8621) దగ్దమయ్యింది .దమ్మపేటకు చెందిన నల్లపోతుల నాగరాజు ఉదయం బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఇంటి బయట కారు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లేసరికి పార్క్ చేసిన కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి . షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు . అశ్వారావుపేట నుండి అగ్ని మాపక యంత్రం వచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది . అగ్నిమాపక యంత్రం ప్రమాద స్థలానికి రావటానికి ఇరుకు మార్గం కావటం వల్ల ప్రమాద స్థలికి చేరుకోలేకపోయింది . చుట్టు పక్కల వాళ్ళు చూసినప్పటికీ కారు నుండి పేలుళ్ల శబ్దాలు రావటంతో ఎవరూ అక్కడికి వెళ్ళటానికి సాహసించలేదు . కారు పూర్తిగా దగ్దమయ్యింది. సంఘటనా స్థలాన్ని దమ్మపేట పోలీసులు చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు .