News & Views

చర్చ : గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, కోర్టు సమీపంలో కారు బీభత్సం…

పెద్దపల్లి , గోదావరిఖని కోర్టు సమీపంలో కారు బీభత్సం…

రెండు కార్లు ,మూడు బైకులపై దూసుకెళ్లిన కారు.ద్వంసమైన కార్లు, బైకులు..

పలువురికి గాయాలు…

డ్రైవరుకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు…

గోదావరిఖని కోర్టు సమీపంలో కారు బీభత్సం సృష్టించింది .చౌరస్తా వైపు అతి వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి కోర్టు సమీపంలో పక్కనే ఉన్న పానీపూరి బండి పైకి దూసుకెళ్లింది. పార్కింగ్ చేసిఉన్న మూడు బైకులు, రెండు కార్లపైకి దూసుకెళ్లగా కార్లు ,బైకులు ద్వంసమయ్యాయి.ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా అతివేగంగా అజాగ్రత్తగా కారు నడిపిన డ్రైవర్ కు స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు..