News & Views

చర్చ : గోదావరిఖని , సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…

చర్చ : గోదావరిఖని.

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

సీఐటీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు. వేల్పుల.కుమారస్వామి డిమాండ్.
సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వేల్పుల.కుమారస్వామి డిమాండ్ చేశారు. అర్జీ వన్ ఏరియాలో జరిగిన జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కుమారస్వామి మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు యాజమాన్యం శ్రమ దొపిడికి గురి చేస్తుందని అన్నారు. కార్మికులు చాలీచాలని వేతనాలతో పని చేస్తూ ఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు. ప్రతి నెల కార్మికులకు రావాల్సిన సీఎంపీఎఫ్ చిట్టీలు గత నాలుగు సంవత్సరాలు ఇవ్వడం లేదని అన్నారు. అసలు సీఎంపిఎఫ్ కార్మికులకు కట్ చేస్తున్నారో లేదోనని అనుమానం వ్యక్తం చేసారు.
ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కన్వేయన్స్ వెహికల్ డ్రైవర్లకు పెండింగ్ లో ఉన్న సీఎంపిఎఫ్ సమస్యను పరిష్కరించి వెంటనే వారికి అందజేసే విధంగా చొరవ చూపాలని అన్నారు.ఇప్పటి వరకు బ్యాంకులో ఖాతా తెరువని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం (సిఐటియు) ఆర్జీవన్ ఏరియా నూతన కమిటీ కమిటీని ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు వేల్పుల.కమారస్వామి తెలిపారు.
ఆర్జీ వన్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులుగా
సిహెచ్.ఉపేందర్, వేల్పుల కుమారస్వామి, కోశాధికారిగా
ఇండ్ల ఓదెలు, ఉపాధ్యక్షులుగా పొనగంటి రవి,
దాసరి స్వప్న,సహాయ కార్యదర్శిలుగా రాజులను ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్మికులు సంధ్య,శేకర్,నరేష్,అంజయ్య,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.