News & Views

చర్చ : కొణిజర్ల , ఖమ్మం జిల్లా, ఆశ్వారావుపేట కు చెందిన డీసీఎం వ్యాన్ అంజనాపురం వద్ద నిమ్మవాగులో గల్లంతు.

అశ్వారావుపేట కు చెందిన డీసీఎం వ్యాన్ అంజనాపురం వద్ద నిమ్మవాగులో గల్లంతు.

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పరిధిలోని అంజనాపురం గ్రామం సమీపంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, పల్లిపాడు గ్రామం నుండి ఏనుకూరు వైపు వెళ్తున్న ఖాళీ డీసీఎం వాహనం అంజనాపురం వద్ద ఉన్న నిమ్మవాగు దాటే ప్రయత్నంలో వరద ఉధృతికి కొట్టుకుపోయింది.

వాహనం వరద ప్రవాహంలో చిక్కుకుని నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో డ్రైవర్‌ కూడా వాహనంతో పాటు గల్లంతయ్యాడని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.

నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితిలో వాహనం వాగు దాటడం ప్రమాదకరమని హెచ్చరికలు ఉన్నప్పటికీ డ్రైవర్ దాటేందుకు ప్రయత్నించాడని సమాచారం.

వ్యాన్ అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామానికి చెందిన మునుగొండ వెంకటముత్యం అనే వ్యక్తికి చెందినదని డ్రైవర్ ఆరెపల్లి మురళి ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంఘటన స్థలం వద్దకు చేరుకున్న వైరా సీఐ కొనిజర్ల ఎస్సై ఘటన పై ఆరా తీస్తున్నారు.