చర్చ : పల్నాడు జిల్లా మాచర్ల మండలం చింతలతండా లో మహబూబ్నగర్ కు చెందిన గొర్రెల కాపరిపై రాళ్ళు, కర్ర తో దాడి , అక్కడికక్కడే మృతి చెందిన గొర్రెల కాపరి…

చింతల తండాలో దారుణం
గొర్రెల కాపరిపై రాళ్ళు, కర్ర తో దాడి , అక్కడికక్కడే మృతి చెందిన గొర్రెల కాపరి.
విజయపురిసౌత్: పల్నాడు జిల్లా మాచర్ల మండలం చింతలతండా గ్రామంలో దారుణం జరిగింది. తన పొలం లోకి గొర్రెలు వచ్చాయనే కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి గొర్రెల కాపరిపై రాళ్ళు, కర్ర తో దాడి చేయడంతో గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గొర్రెల కాపరి జగ్గప్పల సాయి తో పాటు మరో 6 గురు వ్యక్తులు గత కొంత కాలంగా వలస వచ్చి చింతలతండా శివారులో జీవాలు కాస్తూ జీవిస్తున్నారు.
చింతల తండాకు చెందిన రమావత్ బుడ్డా నాయక్ తన పొలంలో గొర్రెలు ఎందుకు మేపుతున్నావని జగ్గప్పల సాయి(26) పై రాయి, కర్రతో దాడి చేశాడు.
దీనితో జగ్గప్పల సాయి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి వివాహం జరిగి మూడు నెలలు అని తెలుస్తుంది. సాటి మనిషిని కనీస కనికరం లేకుండాకొట్టి హత్య చేయడం దారుణం.
మానవత్వం మంటగలిపే ఈ దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది.