చర్చ : సత్తుపల్లి , ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొన్న లారీ ఓ వ్యక్తి మృతి…

ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొన్న లారీ ఓ వ్యక్తి మృతి…
ట్రాక్టర్ ను లారీ వెనుక నుంచి ఢీ కొనగా ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామ శివారు జ్యూస్ ఫ్యాక్టరీ సమీపంలో చోటుచేసుకుంది.108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ రైతు తుంబురు ఉమామహేశ్వర్ రెడ్డి (52) నారాయణపురం గ్రామం నుంచి పామాయిల్ గెలల లోడు తో అప్పారావు పేట పామాయిల్ ఫ్యాక్టరీకి వెళ్లి పామాయిల్ గెలలను దించి తిరిగి ఇంటికి వస్తుండగా తాళ్లమడ గ్రామ సమీపంలో ట్రాక్టర్ కు డీజిల్ అయిపోవడంతో మరో వ్యక్తికి ఫోన్ చేసి డీజిల్ తెప్పించి ట్రాక్టర్ లో డీజిల్ నింపుతుండగా వెనుక నుంచి లారీ ట్రాక్టర్ కున్న టక్కును బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్ కు డీజిల్ నింపుతున్న ఉమామహేశ్వర్ రెడ్డి ట్రాక్టర్ చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడగా స్థానికులు సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న సత్తుపల్లి 108.సిబ్బంది ప్రధమ చికిత్స అనంతరం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుంబురు ఉమామహేశ్వర్ రెడ్డి మృతి చెందారు. రైతు తుంబురు ఉమామహేశ్వర్ రెడ్డి మృతి చెందటంతో నారాయణపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.