చర్చ : ఖమ్మం జిల్లా, సత్తుపల్లి , జిల్లా అండర్ 14 కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మట్ట రాగమయి…


జిల్లా అండర్ 14 కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మట్ట రాగమయి.
సత్తుపల్లి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 14 కరాటే సెలక్షన్ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి నక్క రాజేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ సెక్రటరీ రామారావు, ఖమ్మం జిల్లా కరాటే అసోసియేషన్ సెక్రటరీ పిచ్చయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీదేవి, కన్వీనర్ నాగేశ్వరరావు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు.