చర్చ : సత్తుపల్లి , ఖమ్మం జిల్లా, వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే మట్ట రాగమయి సమీక్ష సమావేశం…

వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే మట్ట రాగమయి సమీక్ష సమావేశం…
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే మట్ట రాగమయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి, ఐదు మండలాల ఏవోలు మాంథా తుఫాను ప్రభావం వలన సత్తుపల్లి నియోజకవర్గంలో తీవ్రంగా పంట నష్టపోయిన పొలాలు వివరాలను నేరుగా రైతుల దగ్గరికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని, సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి మండలం, వేంసూరు మండలం, పెనుబల్లి మండలం, కల్లూరు మండలం, తల్లాడ మండలాలలో పత్తి, వరి ఇతర పంటలలో రైతుకు జరిగిన నష్టాన్ని పరిశీలించి నివేదికలు తయారు చేయాలని ఏవోలను, ఏఈఓ లకు సూచించారు. అంతేకాకుండా సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా ముందుగానే వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని గత సీజన్లో జరిగిన కొన్ని సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడికి, అధికారులకు తెలియజేశారు. వ్యవసాయ అధికారులు ఇచ్చే నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు నివేదిక అందించడం జరుగుతుందని తెలియజేశారు.