News & Views

చర్చ : అశ్వారావుపేట , జన్నారం వాగులొ వ్యాన్ ఆచూకి లభ్యం – మృతాదేహం కోసం గాలింపు….

జన్నారం వాగులొ వ్యాన్ ఆచూకి లభ్యం – మృతాదేహం కోసం గాలింపు.

నిన్న వైరా మండలం జన్నారం వాగు వద్ద కొట్టుకుపోయిన వ్యాన్ ఆచూకీ లభ్యం అయింది NDRF సిబ్బంది స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు కొట్టుకుపోయిన వ్యాను జాడ కనిపెట్టేన NDRF బృందం వ్యానును బయటకు తీయడంలో పూర్తిగా విఫలం అయ్యారనే చెప్పాలి. క్రెయిన్ ను , జెసీబీ లను తీసుకువచ్చి ఉదయం నుండి ప్రయత్నాలు చేస్తున్నారు కాని క్రెయిన్ కి ఉన్నటువంటి వైర్లు తెగిపోవడం వలన వ్యానును బయటకు తీసుకురాలేకాపోయారు. వ్యాను కొట్టుకుపోయి ఆగిన ప్రదేశంలొ లోతుగా ఉండటం నీటి ప్రవాహం కొంచెం తగ్గుముఖం పట్టడంతో రేపు బయటకు తీస్తారని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. ఆ ప్రదేశం కుటుంబ సభ్యుల రోధనలు అందరిని కంటతడి పెట్టించాయి.