News & Views

చర్చ : పెద్దపల్లి , భారత వాయుసేనలో చేరేందుకు అవగాహన సదస్సు…

భారత వాయుసేనలో చేరేందుకు అవగాహన సదస్సు…

భారత వాయుసేనలో చేరేందుకు ఈ నెల 4 న పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి స్వరూప గార్డెన్స్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిగా వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ కమాండింగ్ రిక్రూట్ మెంట్ ఆఫీసర్ పాల్గొంటారని తెలిపారు.భారత వాయుసేనలో చేరడం ఎలా వాయుసేనలో అవకాశాలు ఎలా ఉంటాయి, పరీక్ష విధానం మరియు ఎలాంటి సిలబస్ ఉంటుంది సెలక్షన్ వివరాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.భారత వాయుసేనలో చేరేందుకు ఇదొక సువర్ణ అవకాశం గా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని పెద్దపల్లి జిల్లా నుండి అత్యధికంగా యువత భారత వాయుసేనలో చేరాలని పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నట్లు తెలిపారు.16 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వయసు కలిగిన ఇంటర్మీడియట్, ఆపై చదువులు పూర్తి చేసుకున్న యువతీ,యువకులకు అర్హులని పెర్కోన్నారు. మరిన్ని వివరాల కొరకు ఈ క్రింది నెంబర్ లకు సంప్రదించాలని తెలిపారు. 9949725997, 8333044460