News & Views

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , ప్రభుత్వ నిషేదిత గంజాయి అక్రమ రవాణా కేసులోని నిందితుడిపై పీడియాక్టు నమోదు…

గంజాయి కేసుల్లోని నిందితుడు శివశంకర్ రెడ్డిపై పీడియాక్ట్ నమోదు చేసిన జూలూరుపాడు పోలీసులు...

ప్రభుత్వ నిషేదిత గంజాయి అక్రమ రవాణా కేసులలోని నిందితుడిపై పీడియాక్టు నమోదు…

గంజాయి కేసుల్లోని నిందితుడు శివశంకర్ రెడ్డిపై పీడియాక్ట్ నమోదు చేసిన జూలూరుపాడు పోలీసులు

నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో నిందితుడిగా ఉన్న దుగ్గెంపూడి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తిపై జూలూరుపాడు పోలీసులు పీడియాక్టును నమోదు చేయడం జరిగింది.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి సూచనల మేరకు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ గారి సలహాలతో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి గారు బూర్గంపాడు మండలం సారపాక,తాళ్లగొమ్మూరుకు చెందిన నిందితుడు శివశంకర్ రెడ్డిపై పీడియాక్ట్ నమోదుకై ఉన్నతాధికారులకు తగిన పత్రాలను సమర్పించారు.అక్రమార్జనే ధ్యేయంగా అలవాటుగా నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుడు శివశంకర్ రెడ్డిపై బూర్గంపాడు,జూలూరుపాడు మరియు హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ల నందు కేసులు నమోదు చేయడం జరిగింది.తనపై ఉన్న కేసులలో జైలుకు పోయి తిరిగి వచ్చి తీరు మార్చుకోకుండా మరలా గంజాయి రవాణాకు పాల్పడుతున్న నిందితుడిపై పీడి యాక్టును అమలు చేస్తూ 23.10.2025న పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.ఉన్నతాధికారుల నుండి పీడియాక్ట్ ఉత్తర్వుల కాపీనీ అందుకున్న జూలూరుపాడు పోలీసులు చర్లపల్లి జైలు అధికారుల సమక్షంలో నిందితుడికి అందజేశారు.గంజాయిని అక్రమంగా రవాణా చేసి నిందితుడు శివశంకర్ రెడ్డి సంపాదించిన ఆస్తులను కూడా గతంలో గౌరవ కోర్టు వారి ఆదేశాలతో జూలూరుపాడు పోలీసులు జప్తు చేయడం జరిగింది.

గంజాయి కేసుల్లోని నిందితుడిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పీడియాక్ట్ ను నమోదు చేయడం జరిగిందని ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.ఇలాంటి నేరస్తుల వలన ఎంతో మంది యువత మత్తుకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.అందుకే గంజాయి సమూల నిర్మూలన కొరకు జిల్లా పోలీస్ శాఖ తరపున చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమాన్ని చేపట్టి అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు,జిల్లా ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.అలవాటుగా ఇలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పాడే వ్యక్తులను గుర్తించి,వారిపై కూడా పీడియాక్టులను నమోదు చేయనున్నామని తెలియజేసారు.నిందితుడు శివశంకర్ రెడ్డిపై పీడి యాక్ట్ నమోదయ్యేలా కృషి చేసిన కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి మరియు సిబ్బందిని ఈ సందర్బంగా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.