చర్చ : ములకలపల్లి , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పేకాట ఆడుతున్న మహిళలు పై కేసు…

పేకాట ఆడుతున్న మహిళలు పై కేసు…
ములకలపల్లి , జూదాల వ్యసనంలో మగవారినే అదుపు చేయ్యలేకపోతుంటే విచిత్రంగా మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. మండల పరిధిలోని మూధారం గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పేకాట అడుతున్నారనే సమాచారం రావడంతో స్థానిక పోలీసులు పేకాట స్థావరం పై దాడులు నిర్వహించారు. ఇంకేముంది పేకాట ఆడుతున్న ఐదుగురు మహిళలతో మరో వ్యక్తి అడ్డంగా దొరికిపోయారు. రూ, 5,150 నగదును, ఒక సెల్ ఫోన్ స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మదు ప్రసాద్ తెలిపారు.