News & Views

చర్చ : కేరళ… శబరిమలై సన్నిధిలో రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పణ…

చర్చ : కేరళ… శబరిమలై సన్నిధిలో రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పణ…

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రోజు దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ , అయ్యప్ప స్వామి మాల ధరించి   ఇరుముడితో 18 మెట్లు ఎక్కిన తొలి రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టించారు. భక్తితో స్వామివారిని దర్శించుకున్న ఆమె చర్యలను ప్రపంచంలో ఉన్నభారతీయులు ప్రశంసించారు. 67 ఏళ్ల వయసులోనూ 18 మెట్లు ఇరుముడి నెత్తిన పెట్టుకొని ఎక్కి భక్తి శ్రద్దలతో వేదమంత్రాల సాక్షిగా ఇరుముడి సమర్పించుకున్నారు, రాష్ట్రపతి తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది.