చర్చ : సత్తుపల్లి , ఖమ్మం జిల్లా, ఆర్టీసీ బస్సు ఢీకొని దుప్పి కి తీవ్ర గాయాలు…

ఆర్టీసీ బస్సు ఢీకొని దుప్పి కి తీవ్ర గాయాలు…
వెటర్నరీ హాస్పిటల్ లో ప్రధమ చికిత్స నీలాద్రి అర్బన్ పార్క్ కు తరలింపు…
ఆర్టీసీ బస్సు ఢీకొని దుప్పి తీవ్రంగా గాయపడిన సంఘటన సత్తుపల్లి పట్టణ పరిధిలోని వేంసూరు రోడ్డు నందు ఆదివారం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి పట్టణం వేంసూరు రోడ్డు నందు గల షాదిఖాన్ సమీపంలో దుప్పి సడన్గా, జన సంచారం, రోడ్డు పైకి రాగా అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు దుప్పిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు గుర్తించి ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు సిబ్బంది హుటా హుటినా వెటర్నరీ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించి, అనంతరం సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కు తరలించారు,…….