News & Views

చర్చ : రుద్రంపూర్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి – రుద్రంపూర్ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు…

మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి – రుద్రంపూర్ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం chesaru…

మణుగూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తల దాడి చేసిన ఘటనను రుద్రంపూర్ బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా రోజురోజుకీ పెరుగుతున్న ప్రజాదరణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు సర్వేల్లో ముందంజలో ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోయిందని వారు విమర్శించారు.

అసూయతో కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలమన్నది మరిచి అచ్చం రౌడీల వలె బీఆర్ఎస్ కార్యాలయంలోకి చొరబడి ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై రుద్రంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహ నిరసన తెలిపారు.

బీఆర్ఎస్ నాయకులు బావు సతీష్ గారు మాట్లాడుతూ –

“ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదు. ఇదేనా మీరు చెప్పే ఇందిరమ్మ రాజ్యం? ప్రజల మద్దతు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ భయంతో భౌతిక దాడులకు దిగడం సిగ్గుచేటు,” అని అన్నారు.

ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన డిజిటల్ క్యాంపెయినింగ్ విజయవంతం కావడం, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రావాల్సిన నిధులు మళ్లింపుపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడికి పిలుపు ఇవ్వడమే ఈ దాడికి నేపథ్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సౌల్లా శ్రీనివాస్ , గూడెల్లి ముఖేష్, రవితేజ, సాయి చరణ్, తరుణ్ మన్సింగ్, తదితరులు,కార్యకర్తలు పాల్గొన్నారు.