చర్చ : అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా స్థానిక పోలీస్ వారి ఆధ్వర్యంలో 2 కే రన్ ఫర్ యూనిటీ…

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా స్థానిక పోలీస్ వారి ఆధ్వర్యంలో 2 కే రన్ ఫర్ యూనిటీ.
అశ్వారావుపేటలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా “జాతీయ ఐక్యత దినోత్సవం”ను పురస్కరించుకుని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు అశ్వారావుపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ – 2కే రన్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ రన్ పోలీస్ స్టేషన్ సెంటర్ నుండి పట్టణం చివరి వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీ.ఐ నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారత ఐక్యతకు ప్రతీక అని, ఆయన స్ఫూర్తితో యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు, యువకులు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పరుగెత్తారు. రన్ ఫర్ యూనిటీ ద్వారా ఐక్యత, సోదరభావం, దేశభక్తి విలువలను ప్రతీ ఒక్కరూ ఆచరించాలని అధికారులు పిలుపునిచ్చారు.