News & Views

చర్చ : సత్తుపల్లి , సింగరేణి కాలనీ పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు…ముఖ్య అతిథిగా పాల్గొన్న జి.ఎం షాలెం రాజు!..

ముఖ్య అతిథిగా పాల్గొన్న జి.ఎం షాలెం రాజు!..

చర్చ  :  సింగరేణి కాలనీ పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు…

ముఖ్య అతిథిగా పాల్గొన్న జి.ఎం షాలెం రాజు!

చర్చ, సత్తుపల్లి:

స్థానిక సత్తుపల్లి పట్టణం పి.వి.ఎన్ సింగరేణి కాలనీలో పోచమ్మ తల్లి దేవాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు. జి.ఏం మాట్లాడుతూ మతసామరాస్యానికి ప్రతీక గా సింగరేణి కుటుంబ సభ్యులు అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కాలనీలో ఒక పండుగ వాతావరణం నెలకొందని కాలనీ కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం కాలనీ కుటుంబ సభ్యులు జిఎం శాలెం రాజు ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు ప్రహల్లాద్ , నరసింహారావు , ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీనివాసరావు , జే.వి.ఆర్ సి.హెచ్.పి డీ.జీ.ఎం సోమశేఖర్ , మేనేజర్లు రాజేశ్వరరావు , రామకృష్ణ , కళ్యాణ్ రామ్ , సివిల్ ఇంజనీర్ రవి కుమార్ ఇతర ముఖ్య అధికారులు , కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ , సత్తుపల్లి ఏ.ఐ.టి.యు.సి బ్రాంచ్ సెక్రెటరీ సముద్రాల సుధాకర్ , ఐఎన్టీయూసీ బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతి కుమార్ , ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ సూర్య ప్రకాష్ , ఐఎన్టియుసి ఫిట్ సెక్రటరీలు రామారావు , నాగేశ్వరరావు , బాలాజీ , ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ నరసింహారావు ఇతర ముఖ్య నాయకులు , ఉద్యోగులు , కాలనీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.