News & Views

చర్చ : మణుగూరు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బిఆర్ఎస్ ఆఫీసుకు నిప్పు పెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు… పోలీసులు సెక్షన్ 144 అమలులోకి తెచ్చారు…

దాడిని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ పార్టీ  జిల్లా అధ్యక్షులు  మాజీ ఎమ్మెల్యే  రేగ కాంతారావు.

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు. కార్యకర్తలు గుంపులుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. రేగ ఎలాంటి వ్యఖ్యలు చేస్తారో అని ఉత్కంఠ నెలకొంది. అక్కడ అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా పార్టీ కార్యాలయం వద్ద పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి.