News & Views

చర్చ : జగిత్యాల జిల్లా, క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం…

క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం…

చర్చ, జగిత్యాల, , క్రీడాలతో శారీరక, మానసిక ఉల్లాసానికి దోహధపడతాయని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం పట్టణం లో మినిస్టేడియంలో క్రికెట్ టోర్నిని ఎమ్మెల్యే ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరీష్ సింగ్ విద్యార్తి స్తాయి నుండి తనకు మంచి అనుబంధం ఉందని అతని పేరుతో టోర్నమెంట్ నిర్వహించడం శుభపరిణామమన్నారు. క్రీడాకారులు కోసం

జగిత్యాల సమీపంలోనే 10 ఎకరాల్లో కొత్త స్టేడియానికై కృషి చేస్తున్నానని చెప్పారు.

గతంలోనూ బ్లూమూన్ క్రికెట్ పోటీలకు వైద్యునిగా హాజరయ్యానని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చుక్క నవీన్, స్వప్న గిరీష్, జలందర్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, శ్రీరామ్ భిక్షపతి, విఘ్నేష్, జర్నలిస్ట్ జహీర్, స్పాన్సర్ లు శ్రీచైతన్య కళాశాల కరస్పాండెంట్ రాజేందర్, రౌతు గంగాధర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.