చర్చ : అశ్వారావుపేట , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నీళ్ల కోసం విద్యార్థుల ఆందోళన …..

నీళ్ల కోసం విద్యార్థుల ఆందోళన
చర్చ,ములకలపల్లి; మండలంలోని మూకమామిడి ఏకలవ్య పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. మూడురోజులగా నీళ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గేటు వద్దకు వచ్చి కేకలు వేస్తున్నారు. మూడు రోజుల నుంచి సమస్యలు చెబుతున్నా ఏకలవ్య సిబ్బంది, ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉదయాన్నే మోహం కూడా కడుక్కునే పరిస్థితి లేక హాస్టల్ ముందు ఎండలో బయటాయించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకుంటున్నారు.