News & Views

చర్చ : తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర కు ముందు గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పింన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత…

తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర కు ముందు గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పింన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యమకారులకు క్షమాపణలు కోరుతున్న.

అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న.

ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ..

తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు. వారి త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం.

ఏ ఆశయాల కోసం వారు అమరులయ్యారో వాటిని ఎంత వరకు సాధించుకున్నామో ఆలోచించుకోవాలి.

పేగులు తెగేదాక కొట్లాడిన ఉద్యమ కారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలి.

తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీ లో చెప్పాం. కాని వారికి ఇవ్వాల్సిన గౌరవం, వారి కుటుంబాలకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు.

ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పాం. కానీ 580 మందికి మాత్రమే ఇచ్చాం. మిగతా వారికి న్యాయం చేయలేదు.

ఉద్యమకారుల్లో కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎమ్పీటీసీ, సర్పంచులు లాంటి అవకాశాలు వచ్చాయి. కానీ ఇంకా వేలాది మందికి జరగాల్సిన న్యాయం జరగలేదు.