చర్చ : సత్తుపల్లి , ఖమ్మం జిల్లా, ఘోర రోడ్డు ప్రమాదం వివాహిత మృతి…

ఘోర రోడ్డు ప్రమాదం వివాహిత మృతి…
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అగు ఉన్న లారీని తప్పించ బోయే క్రమంలో ద్విచక్ర వాహనం మరో లారీని ఢీకొట్టడంతో బైకుపై ప్రయాణిస్తున్న దంపతులలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలు అవటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రావికంపాడు గ్రామానికి చెందిన గుర్రం సంపూర్ణగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.