News & Views

చర్చ : కొత్తగూడెం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , పోస్టాఫిస్ సెంటర్ లో బస్సు ఢీకొని మహిళ మృతి..

చిన్న రోడ్లు...చితిలమైతున్న ప్రజల ప్రాణాలు, ట్రాఫిక్ నియంత్రణ కరువు...

బస్సు ఢీకొనడంతో మహిళా మృతి

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం:
కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. మృతురాలు మేదర్ బస్తికి చెందిన మొలుగూరి లక్ష్మి గా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే మొలుగూరి శ్రీనివాస్, భార్య లక్ష్మి బైక్‌పై కొత్తగూడెం బస్టాండ్ నుండి పోస్టాఫీస్ వైపు వెళ్తుండగా, ముందు ట్రాలీ, వెనుక బైక్ ఉండడంతో పరిస్థితిని అంచనా వేయలేకపోయారు. ఈ క్రమంలో వెనుకనుంచి వచ్చిన బస్సు బైకును ఢీకొట్టడంతో బైక్ అదుపుతప్పింది. దీంతో మొలుగూరి లక్ష్మి బస్సు కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాస్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ప్రమాద సమాచారం అందుకున్న కొత్తగూడెం వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.