News & Views

చర్చ : రామగిరి: ఆర్.జి-త్రీ, ఎ.పి.ఎ.ఏరియాలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పర్యటన

సింగరేణి సంస్థ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పి.బాలరాజు, మంగళ వారం రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో పర్యటించారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి ఏరియా పర్యటనకు విచ్చేసిన సందర్భముగా రామగుండం-3, ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లను మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని జియంలు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
తదుపరి సెక్యూరిటీ కార్యాలయం లో ఏరియా సెక్యూరిటీ సిబ్బందినీ పరిచయం చేసుకోవడం జరిగింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ భద్రతా సిబ్బంది పనితీరు, విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, సౌకర్యాలు తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి పలు సెక్యూరిటీ చెక్ పోస్టులను తనిఖీ చేశారు.
భద్రతా సిబ్బందిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ సంస్థ భద్రతా వ్యవస్థలో సెక్యూరిటీ గార్డుల పాత్ర అత్యంత కీలకమని, విధి నిర్వహణలో క్రమశిక్షణ, అప్రమత్తత, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, సంస్థ ఆస్తులు, సిబ్బంది రక్షణే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ కె.యాదయ్య, ఎస్వోటూజియం లు యం.రామ్మోహన్, బండి సత్య నారాయణ, ఐఇడి డిజియం బి.టి. మురళి కృష్ణ, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ షబ్బిరుద్దీన్, సీనియర్ ఇన్స్పెక్టర్ పోగుల స్వామి, జేమేదార్ కె.సదయ్య, ఇతర అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.