News & Views

చర్చ , గోదావరిఖని: ప్రేమ,శాంతికి ప్రతీక క్రిస్మస్ పండుగ.. వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాగూర్..

క్రిస్టమస్ పండుగ నేపథ్యంలో గోదావరిఖనిలోని కల్వరి, సిఎస్ఐ చర్చ లో జరిగిన వేడుకలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ముఖ్యతిధిగా పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సోదరభావం వంటి విలువలను బోధిస్తుందని అన్నారు. మత సామరస్యం, ఐక్యతతో సమాజం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పండుగను అందరూ కలిసి జరుపుకోవడం మన రాష్ట్ర ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకే రోజు జరుపుకునే పండుగ క్రిస్టమస్ పండుగ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.