చర్చ,గోదావరిఖని: నూతన లేబర్ కోడ్ లు రద్దు చేయాలంటూ సిఐటియు నిరసన…
నూతన లేబర్ కోడ్ లు రద్దు చేయాలంటూ సిఐటియు నిరసన...
చర్చ,గోదావరిఖని:
నూతన లేబర్ కోడ్ లు రద్దు చేయాలంటూ సిఐటియు నిరసన…
సింగరేణి సంస్థ రామగుండం ఏరియా వన్ గోదావరిఖని రెండో బొగ్గు గని పై సి.ఐ.టి.యూ ఆధ్వర్యంలో కార్మిక ఆందోళన జరిగింది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రతులను దహనం చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు, గరిష్ట లాభాల కోసమే కేంద్రం పని చేస్తుందని ఆరోపించారు. కార్మిక హక్కులకు భంగం కలిగించే లేబర్ కోడ్ల అమలుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరిస్తే మంచిదని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, ఇతర కార్మిక సంఘాలు కూడా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.