News & Views

చర్చ, కొత్తగూడెం: గీత కంఠస్థ పోటీలో ప్రతిభ చాటిన ఒకటవ తరగతి విద్యార్థి

గీత కంఠస్థ పోటీలో ప్రతిభ చాటిన
ఒకటవ తరగతి విద్యార్థి

అభినందించిన శిశు మందిర్ ఆచార్యులు

భగవద్గీత కంఠస్థ పోటీలలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఒకటో తరగతి విద్యార్థి యశ్వంత్ తన ప్రతిభను చాటుకున్నారు అదే పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని అంబిక బహుమతిని అందుకుంది.విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో కొత్తగూడెం వివేకానంద పాఠశాలలో ఆదివారం భగవద్గీత కంఠస్థపోటీలు జరిగాయి విశ్వహిందూ పరిషత్ ప్రముఖ్ ఎం వి కే శర్మ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి జరిగిన కంఠస్థ పోటీలు తర్వాత గెలుపొందిన వారికి విశ్వహిందూ పరిషత్ బహుమతులను అందజేసింది పుస్తక పఠనం కల్పతరువు లాంటిదని ప్రముఖులు కార్యక్రమంలో హితవుపలికారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు, తల్లిదండ్రులు వివిధ పాఠశాలలు విద్యార్థులు పాల్గొన్నారు