చర్చ, జగిత్యాల : ఈవీఎమ్ ల గోదాము తనిఖీ చేసిన కలెక్టర్

భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలన
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల ఈవీఎంలను భద్రపరిచిన గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు.
గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత ,జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, కలెక్టరేట్ ఏవో హకీమ్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ తదితరులున్నారు.