చర్చ,పెద్దపల్లి: పోలీంగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి జిల్లా రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.
పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, జూలపల్లి మండలాల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలకు తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
మొదటి విడత కంటే రెండో విడత పోలింగ్ శాతం బారీగా పెరగనునుందని అన్నారు. పెరుగుతున్న పోలింగ్ కు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాలలో సరిపడా టేబుళ్లను పెంచుతున్నామని తెలిపారు. అలాగే అవసరమైతే కౌంటింగ్ హాల్ కూడా పెంచుతామని, మొదటి విడత తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.