చర్చ, కరీంనగర్: ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ పై కాంగ్రెస్ నేత అని ల్ ఫిర్యాదు
కరీంనగర్ కార్పొరేషన్ రెండవ డివిజన్ తీగలగుట్టపల్లికి చెందిన కాంగ్రెస్ నేత కొలగాని అనిల్ ప్రజావాణిలో బిజెపి మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ జాతీయ ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం చేశారని, దీనిపై వెంటనే విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కి లేఖ అందజేశారు. MGNREGS నిధుల నుండి రూ.లు 50,00,000/- (అక్షరాల యాబది లక్షల రూపాయలు) నగునూరు గ్రామ అభివృద్ధి మంజూరి గురించి అయ్యాయని, మంజూరు అయిన నిధులను నగునూరు గ్రామ ప్రజల అభివృద్ధి కొరకు వినియోగించకుండా 1వ (ప్రస్తుత 2వ) డివిజన్ బి.జె.పి. తాజా మాజీ కార్పోరేటర్ కొలగాని శ్రీనివాస్ తన స్వంత ఫామ్ హౌజ్, వ్యవసాయ భూముల కొరకు సి.సి. రోడ్డు మరియు డ్రైనేజిని నిర్మాణం కోసం ఖర్చు చేసినట్టు తెలిసిందని, సరియైన సమగ్ర విచారణ జరిపారని లేఖలో పేర్కొన్నారు. నిధులను దుర్వినియోగానికి పాల్పడినట్లయితే మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ మరియు అతనికి సహకరించిన వారిపై, రోడ్డు వేసిన కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని 2వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలగాని అనిల్ జిల్లా కలెక్టర్ కి రాసిన ఫిర్యాదు లేఖలో పేర్కొంటూ, ఇందుకు సంబంధించిన ఎంబి రికార్డ్ ఆధారాలను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.