News & Views

చర్చ : స్పోర్ట్స్ , కొత్తగూడెం , ఈ నెల హైదరాబాద్ జింఖానా స్టేడియంలో నిర్వహించిన SGF స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ మీట్‌లో, కొత్తగూడెం లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలను సాధించారు…

చర్చ : స్పోర్ట్స్ , కొత్తగూడెం.

ఈ నెల హైదరాబాద్ జింఖానా స్టేడియంలో నిర్వహించిన SGF స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ మీట్‌లో, కొత్తగూడెం లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలను సాధించారు.

తమ ప్రతిభతో ముందుకు సాగుతున్న ఈ క్రీడాకారులు ఈ నెల నవంబర్ 26 నుండి డిసెంబర్ 31 వరకు హర్యానా రాష్ట్రంలోని భీమ్ స్టేడియం, భీవానిలో జరగనున్న జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు.

జిల్లా యువజన క్రీడా కార్యాలయం అధికారి పరంధాం రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహీధర్, జాతీయ కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్, జిల్లా SGF సెక్రటరీ వాసిరెడ్డి నరేష్ క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించి జిల్లా గర్వాన్ని పెంచాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో PET అరుణకుమారి, కోచ్ లు డి. మల్లికార్జునరావు, సుష్మా బాయి తదితరులు పాల్గొన్నారు.