News & Views

సర్పంచ్ పదవి మాదే అంటున్న కాంగ్రెస్ శ్రేణులు – మద్దతు తెలుపుతున్న బిఆర్ఎస్ కార్యకర్తలు

సర్పంచ్ పదవి మాదే అంటున్న కాంగ్రెస్ శ్రేణులు – మద్దతు తెలుపుతున్న బిఆర్ఎస్ కార్యకర్తలు
అభివృద్ధి నా ప్రాధాన్యత, ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి – అజ్మీరా మంగీలాల్

చర్చ చుంచుపల్లి

చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా మంగీలాల్ కు ఉంగరం గుర్తు లభించింది. ప్రచారంలో భాగంగా విజయం ఖాయం అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. అవకాశం ఇస్తే నిరూపించుకోలేకపోయారు బిఆర్ఎస్ మాజీ సర్పంచ్, అవకాశాలు తీసుకోవడానికి ఇక్కడ జరిగేది సినిమా రాజకీయం కాదు, గ్రామ అభివృద్ధి. ఐదు సంవత్సరాల విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకొని, ఓటర్లను మోసం చేశారని బిఆర్ఎస్ కార్యకర్త తన గళానికి బలాన్ని పెంచారు. గెలిచిన తర్వాత సొంత ఖర్చుతో అయినా అభివృద్ధికి సాయపడతా తప్ప ఓటుకు నోటు రాజకీయం చెయ్యను. అవకాశం ఇవ్వండి అభివృద్ధికి నాంది పలుకుతానని ప్రచారంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.