చర్చ హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం..
చర్చ హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. దాదాపుగా 25 వేలకుపైగా మెజారిటీతో కాంగ్రెస్ ఈ విషయం సాధించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 4.01 లక్షల మంది ఓటర్లలో 48.49 శాతం మాత్రమే (1,94,631 ఓట్లు) పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన ఈ సీటు కోసం నాలుగు రోజుల కిందట (నవంబర్ 11) పోలింగ్ జరిగింది.
కాంగ్రెస్ పార్టీ తమ గడచిన రెండు సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా ప్రచారం చేసింది. ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం తదితర అంశాలను ప్రధానంగా ఎన్నికల్లో చెప్పుకుంది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ కుటుంబ వ్యవహారాన్ని హైలెట్ చేయడంలో ఒక రకంగా విజయం సాధించిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలోకి దిగడం కూడా పార్టీ విజయానికి ఉపకరించింది.
మరోవైపు బీఆర్‌ఎస్ సానుభూతి ఓట్లు పడుతాయనే నమ్మకంతో రంగంలోకి దింపిన మాగంటి సునీత బలహీన అభ్యర్థి అని మొదటి నుంచే ప్రచారం సాగింది. దానికి తగినట్లే ఆమె ప్రసంగం కూడా ఎక్కడ ఆకట్టుకోలేకపోయింది. ఇది కూడా నవీన్‌కు కలిసి వచ్చిందనే చెప్పాలి. అలాగే గోపినాథ్ మొదటి భార్య విషయంలో గోపినాథ్ తల్లి, చేసిన ఆరోపణలు కూడా సునీత ఓటమిపై ప్రభావం చూపాయనే చెప్పాలి.