చర్చ, భద్రాచలం : అక్రమ ఇసుక వ్యాపారాలకు* *భద్రాచలంలో కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ

చర్చ, భద్రాచలం :
అక్రమ ఇసుక వ్యాపారాలకు*
*భద్రాచలంలో కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ*
*
*కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధుల కనుసన్న లోనే ఇసుక వ్యాపారం..*
*భద్రాచలం పట్టణంలో పేదలకు అందుబాటులోకి రాని ఇసుక…*
*పట్టణానికి మంజూరైన రోడ్లు డ్రైనేజీకి మాత్రం ఇసుక ఎలా వస్తుంది.. పేదోడి ఇంటికి ఎందుకు రావడం లేదు* ..
*బిఆర్ఎస్ నేత రావులపల్లి రాంప్రసాద్…*
భద్రాచలం పట్టణంలో ఇసుక వ్యాపారం మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతుందని పేదలకు ఇసుక అందని ద్రాక్షగా మారిందని ఒక్కొక్క ఇసుక ట్రాక్టర్ 5000 నుండి 6000 వరకు అక్రమంగా అమ్ముతున్నారని.. భద్రాచలంలో అక్రమ ఇసుక వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అని వారి
కను సన్నలలోనే ఇసుక వ్యాపారం కొనసాగుతుందని *బిఆర్ఎస్ నేత రావులపల్లి రాంప్రసాద్ ఆరోపించారు..*
పట్టణంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం జరుగుతున్న వాటికి ఇసుక ఎలా వస్తుంది..కానీ సామాన్య ప్రజలకు ఇసుక ఎందుకు రావడం లేదు అభివృద్ధి పేరుతో ఇసుకని తీసుకువచ్చి బహిరంగంగా ప్రజలకు అమ్ముకుంటున్నారు ఇది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కనుసన్నలో జరుగుతుంది.. కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తైన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ వ్యవహారం చేస్తున్నారని ఆరోపించారు
సిండికేట్ ముఠాగా ఏర్పడి కొంతమంది ఇసుక ట్రాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తూ ముడుపులు ఇస్తూ నడుపుకుంటున్నాం అని భహిరంగ గా చర్చించు కుంటున్నారని ఆరోపించారు… ఇది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు. అధికారుల కళ్ళు కప్పి సిండికేట్ కు సపోర్ట్ చేస్తూ పేద ప్రజలకు ఇసుక అందకుండా చేస్తూ బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు