News & Views

చర్చ, కొత్తగూడెం: వినియోగదారులు ప్రతి ఒక్కరు HPCL ఆదేశాల మేరకు eKYC చేఇంచుకోవాలి-తెలంగాణ స్టేట్ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్

సివిల్ సప్లయ్స్ కొత్తగూడెం హెచ్ పి గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి

సివిల్ సప్లయ్స్ కొత్తగూడెం హెచ్ పి గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి

తెలంగాణ స్టేట్ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఎల్పిజీ సెంటర్ -కొత్తగూడెం వినియోగదారులు ప్రతి ఒక్కరు HPCL ఆదేశాల మేరకు eKYC చేఇంచుకోవాలి..

HP Gas (TSCSCL)కొత్తగూడెం గృహ ఎల్పిజి వినియోగదారులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డబ్బులు పొందాలనుకుంటే, తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణను (eKYC) పూర్తిచేయాలి.
ఈ క్రింది పద్ధతులలో దేనిద్వారానైనా ఉచితముగా బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ ను (eKYC) చేసుకొనగలరు:

1. స్వీయ బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ (eKYC)(HP PAY)మరియు (Eaadhar) ఆప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మొబైల్ యాప్ ద్వారా స్వీయ బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణను చేసుకొనగలరు.
2. మీ ఇంటికి తెచ్చే గ్యాస్ డెలివరీ బాయ్ డెలివరీ ద్వారా బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ (eKYC) చేసుకొనగలరు.

సివిల్ సప్లయ్స్ కొత్తగూడెం ఎల్పిజీ సెంటర్ పరిధిలోగల వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా కొంతమంది HP Gas వినియోగదారులు చనిపోవడం వలన వారి యొక్క eKYC చేయటానికి వీలు లేదు కావున చనిపోయిన వినియోగదారులు చాలా రోజులు అయినను ఇప్పటివరకు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులలో ఒకరు పేరు మీద మార్చుకోవలసి ఉంటుంది కానీ ఇప్పటివరకు చాలామంది వినియోగదారులు చనిపోయిన తర్వాత కూడా వారి వారసులు పేరు మీద గ్యాస్ కనెక్షన్ మార్చుకోలేదు అటువంటి చనిపోయిన వినియోగదారులకు eKYCచేయుట వీలు పడదు మరియు కొంతమంది వినియోగదారులు గ్యాస్ కనెక్షన్ కొరకు ఇచ్చినటువంటి అడ్రస్ లో కూడా చాలాకాలంగా వారి అడ్రస్ లో ఉండటం లేదు మరియు గడిచిన ఆరు నెలల ఎటువంటి గ్యాస్ వినియోగము కూడా చేయటం లేదు, అటువంటి వినియోగదారుల బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణను చాలా వరకు పెండింగ్ లో ఉన్నది, వారి యొక్క వివరములు సివిల్ సప్లయ్స్ కార్యాలయము నోటీసు బోర్డు యందు ప్రచురించ బడినది కావున ఈరోజు నుండి ఏడు పని దినములలో ఏమైనా అభ్యంతరములు ఉన్నచో తెలియజేయగలరు.తదుపరి ఏడు రోజుల తర్వాత నోటీసు బోర్డులో ప్రచురించబడిన కన్జ్యూమర్ నెంబర్లను తాత్కాలికంగా హోల్డ్ చేయబడును. కావున ఎవరైతే వినియోగదారులు ఇప్పటివరకు eKYC చేసుకోలేదు వారు తప్పనిసరిగా పైన తెలిపిన పద్ధతిలో ఈ కేవైసీ పూర్తి చేసుకోగలరు.ఎవరైనా వినియోగదారులు eKYC ఇప్పటికి చేయనట్లయితే వారికి రాష్ట్ర ప్రభుత్వం వారిచే వచ్చే సబ్సిడి శాశ్వతముగా చెల్లించబడదు. బయోమెట్రిక్ ప్రామాణీకరణ లేనందున ఎల్పెజి రీఫిల్స్ సరఫరా మరియు డెలివరీలో ఎటువంటి అంతరాయం ఉండదనీ తెలియజేస్తున్నాము.కావున గ్యాస్ వినియోగదారులు గమనించి ఇప్పటికి పెండింగ్ లో ఉన్న eKYC పూర్తిచేసుకునటకు మా సివిల్ సప్లయ్స్ కొత్తగూడెం డెలివరీ బాయ్ మీ ఇంటి వద్దకు వచ్చి eKYC వివరములు అడిగినప్పుడు మా కార్యాలయం సిబ్బందికి సహకరించి మీ eKYC పూర్తి చేసుకోగలరని మనవి చేస్తున్నాను. మరిన్ని వివరాలకోసం, దయచేసి సివిల్ సప్లయ్స్, ఎల్పిజీ సెంటర్- కొత్తగూడెం హెచ్ పి గ్యాస్ కార్యాలయం : 08744 242340 ను సంప్రదించండి.