News & Views

చర్చ,తుంగతుర్తి: కళాకారుడికి పట్టాబిషేకం

  • పాటగాడిగా వచ్చా ..మీ సేవకుడిగా మారా..
  • తన పాటతో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నూతన సర్పంచ్..

సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం వెంపటి గ్రామానికి చెందిన తప్పట్ల ఎల్లయ్య వృత్తిరిత్యా కళాకారుడు, తాపి మేస్త్రిగా జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు.
వీరి గ్రామం సర్పంచు ఎన్నికలలో ఎస్సి జనరల్ స్థానం కేటాయించగా సర్పంచుగా బరిలోకి దిగాడు.తన మాట,పాట,ఆటలతో ప్రజలను దృష్టి ఆకర్షించి విజయం సాదించాడు.నేడు (సోమవారం )సర్పంచిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
ఎల్లయ్య స్వయంగా కళాకారుడు కాగా తను పాటరూపంలో ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరికి ఆకట్టుకున్నాడు.
“నేను ఒక కళాకారునిగా మీ ముందుకు వచ్చాను… ఇప్పుడు మీ ఇంటి సేవకుడిగా బాధ్యత తీసుకుంటున్నాను” అంటూ ఆయన పాడిన పాట గ్రామ ప్రజలను ఎంతగానో ఆలోచింపజేసింది. అధికారం కోసం కాకుండా, ఒక కళాకారుడి సున్నితమైన మనసుతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, ఆఖరి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.
కళాకారుడి నుండి ప్రజా నాయకుడిగా ఎదిగిన ఎల్లయ్య కు గ్రామ ప్రజలు,అదికారులు శుభాకాంక్షలు తెలిపారు.